గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.

నిందితుడి నుంచి 1.02 కిలోల గంజాయి స్వాధీనం.  - ఎస్సై ప్రశాంత్ వర్ధన్. 

Published On
గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.

లోకల్ గైడ్/ తాండూర్ 
గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి విక్రయించేందుకు వచ్చిన బీహార్‌కు చెందిన మొహమ్మద్ ముస్తకీమ్ (44)ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 1,020 గ్రాముల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ...
ఈ నెల 22న అందిన విశ్వసనీయ సమాచారంతో జూనియర్ కళాశాల సమీపంలోని జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు, బ్యాగ్‌తో వచ్చిన ముస్తకీమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో గంజాయి లభించడంతో ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.కాగా స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.34 వేలు ఉంటుందన్నారు. ఎవరైనా గంజాయి విక్రయించిన కొనుగోలు సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు