బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ

తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో తీజ్ పూజలు.. సంప్రదాయ నృత్యాలతో సందడి చేసిన యువతులు

Published On
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 23 (లోకల్ గైడ్):

బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే తీజ్ పండుగను దుబ్బ తండాలో ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా గ్రామంలో డీజేలను ఏర్పాటు చేసి యువతులు తొమ్మిది రోజుల పాటు బంజారా సంప్రదాయాలకు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో తీజ్ పూజలు నిర్వహించారు. అనంతరం తీజ్ నిమజ్జన కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టారు.

ఈ సందర్భంగా దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. యువతులు సంప్రదాయ దుస్తులు ధరించి బంజారా సంప్రదాయ నృత్యాలతో సందడి చేశారు. గ్రామంలోని మహిళలు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను వైభవంగా నిర్వహించారు.

ప్రకృతిని, పంటలను, పశుసంపదను గౌరవించే బంజారా సమాజంలో తీజ్ పండుగకు విశిష్టమైన స్థానం ఉందని దుబ్బ తండా సర్పంచ్ ఆంగోత్ మాతృనాయ తెలిపారు. తరతరాలుగా వస్తున్న బంజారా సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. తీజ్ పండుగ ప్రజలందరినీ ఒక్కచోట చేర్చి ఐక్యతను, సోదరభావాన్ని చాటుతుందని పేర్కొన్నారు.

పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, యువతుల సంప్రదాయ నృత్యాలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తీజ్ నిమజ్జనంతో వేడుకలు ఘనంగా ముగిశాయి.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు