- District News
- Khammam
- శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు
మేళతాళాలతో ఘనంగా ఊరేగింపు.. గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 23 (లోకల్ గైడ్) :
కారేపల్లి వెంకట సాయి నగర్‌లో శ్రావణమాసం సందర్భంగా ఆదివారం ముత్యాలమ్మ బోనాల వేడుకలను కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అలంకరించుకుని బోనాలను నెత్తిన పెట్టుకుని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామదేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మ అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి బోనాలను సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులతో కాలనీలో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణమాసంలో నిర్వహించిన ఈ బోనాల వేడుకలతో వెంకట సాయి నగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రాంబాబు, బొల్లు హనుమంతరావు, రవి, భాగం సత్యనారాయణతో పాటు పలువురు భక్తులు, మహిళలు, యువత పాల్గొన్నారు.
