మార్కండేయ ఆలయ అభివృద్ధి కై విరాళాలు అందించండి

ఆలయ కమిటీ విజ్ఞప్తి 

Published On
మార్కండేయ ఆలయ అభివృద్ధి కై విరాళాలు అందించండి

నారాయణపేట ఆగస్టు 9:

నారాయణపేట పట్టణంలోని మార్కండేయ
ఆలయ అభివృద్ధి తో పాటు ఇతర నిర్మాణ పనుల కై ప్రతి పద్మశాలి కుటుంబ సభ్యులు తమకు తోచినంత  వార్షిక చందా విరాళాలు ఇవ్వాలని  పట్టణ పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు డాక్టర్ క్యాతన్ రఘునాథ్
 కోరారు. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఆదివారం పద్మ శాలీల కుటుంబ సభ్యుల ఇంటింటికి తిరుగుతూ చందా విరాళాలు సేకరించా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పట్టణంలో ని సుభాష్ రోడ్డులో గల శ్రీ భక్త మార్కండేయ స్వామి  స్వామి వారి  ఆలయ అభి వృద్ధి కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా విరాళాలు ఇవ్వాలని అన్నారు. ఈనెల ఆగస్టు 27, 28 తేదీలలో రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని రెండు రోజులపాటు స్వామి వారికి ప్రత్యేక పూజ కార్య క్రమాలతో పాటు యజ్ఞం, యజ్ఞో పవిత ధారణ కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే స్వామి వారి పల్లకి సేవ ఊరేగింపు  వేడుకలను ఘనంగా జరు పుతున్నట్లు పేర్కొన్నారు. క పద్మశాలిల కుటుంబ సభ్యులు, భక్తులు, మహిళ లు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి వేడుకలను జయప్ర దం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు నీది బాలరాజు, పాపయ్య, కర్లీ వరప్రసాద్ పాల్గొన్నా రు.
ఫోటో రైట్ అప్:1.విరాళాలు సేకరిస్తున్న పద్మశాలి సంఘం సభ్యులు 
_____________________

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు