బిడ్డకు  తల్లి పాలే  సంపూర్ణ ఆరోగ్యం ...రక్షణ కవచం  *

జిల్లా కలెక్టర్ ప్రియాంక.

Published On
 బిడ్డకు  తల్లి పాలే  సంపూర్ణ ఆరోగ్యం ...రక్షణ కవచం  *

నారాయణపేట ఆగస్టు 5:
తల్లిపాలు అనేవి కేవలం ఆహారం మాత్రమే కాదని,సంపూర్ణ ఆరోగ్యం బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన తొలి రక్షణ కవచమని జిల్లా కలెక్టర్ ప్రియాంక తెలిపారు.
ప్రపంచ తల్లిపాల వారోత్స వాలను పురస్కరించుకొని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం నారాయణపేట మండలం జాజాపూర్ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన మొదటి గంటలో వచ్చే లేత పసుపు రంగు పాలను ముర్రుపాలు (కొలస్ట్రం) అని పిలుస్తారని, చాలా మంది దీనిని సాధారణ పాలుగా భావించినప్పటికీ, వాస్తవానికి అది బిడ్డకు అందించే తొలి టీకా వంటి దని తెలిపారు. శిశువులో రోగనిరోధక శక్తిని పెంచి, అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుం చి రక్షించే గుణాలు ఈ పాలలో ఉంటాయని చెప్పారు. అందువల్ల ప్రతి బిడ్డకు పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు తప్ప నిసరిగా ఇవ్వాలని సూచిం చారు.ఇటీవలి కాలంలో తల్లిపాల విషయంలో అనేక అపోహలు వ్యాపిస్తు న్నాయని ఆమె పేర్కొన్నా రు. ముఖ్యంగా సిజేరియన్ ప్రసవం అనంతరం పాల బాటిళ్లు కొనుగోలు చేయా లని లేదా బిడ్డకు తేనె, ఇత ర పదార్థాలు ఇవ్వాలని కొందరు సూచిస్తున్నారని, ఇవన్నీ శాస్త్రీయంగా సరై నవి కావని ఆమె స్పష్టం చేశారు. పిల్లలను కనడం, తల్లిపాలు ఇవ్వడం అనేవి ప్రకృతి సిద్ధమైన ప్రక్రియల ని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా వైద్యుల సూచ నలను మాత్రమే పాటించా లని కోరారు.బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెల ల పాటు తల్లిపాలు మాత్ర మే ఇవ్వాలని, నీరు, తేనె, పాలపొడి లేదా ఇతర ఆహా ర పదార్థాలు అవసరం లేద న్నారు. కొన్ని సందర్భాల్లో తల్లికి వెంటనే పాలు రాక పోయినా భయపడాల్సిన అవసరం లేదని, మంచి పోషకాహారం తీసుకుంటూ వైద్యుల సలహాలు పాటిస్తే తల్లిపాలు సహజంగానే వస్తాయని తెలిపారు.
గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ప్రత్యేక శ్రద్ధ చూపుతారని, అయితే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఆరో గ్యం చాలాసార్లు నిర్లక్ష్యానికి గురవుతుందని అన్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని, తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని పేర్కొన్నారు. పాలిచ్చే తల్లు లు కూడా పోషకాహారం తీసుకోవడంతో పాటు వైద్యుల సూచన మేరకు ఐరన్, కాల్షియం మాత్రల ను కొనసాగించాలని సూచించారు.పిల్లలు పుట్టి న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినకూడదనే అపోహలు ఇప్పటికీ ఉన్నా యని, అయితే శాస్త్రీయం గా అలాంటి నిషేధాలు లేవని కలెక్టర్ స్పష్టం చేశా రు. ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు, పాలు, గుడ్లు, నాన్‌వెజ్ వంటి సమతుల ఆహారాన్ని వైద్యులు నిషేధించనంత వరకు తీసుకోవచ్చని తెలి పారు. మన ఇంట్లో పండిం చే జామపండ్లు, ఆకుకూర లు, కూరగాయలు, పప్పులే ఉత్తమ పోషకాహారమని, ఖరీదైన విదేశీ పండ్ల కోసం వెతకాల్సిన అవసరం లేద ని చెప్పారు.ఆరు నెలలు పూర్తయిన తర్వాత తల్లి పాలతో పాటు మెత్తగా చేసి న అన్నం, పప్పు, కూరగా యలు వంటి ఘన ఆహారా న్ని ప్రారంభించాలని, అదే సమయంలో తల్లిపాలను కూడా కొనసాగించాలని సూచించారు.ఆశా కార్యక ర్తలు, అంగన్‌వాడీ సిబ్బం ది, ఏఎన్‌ఎంలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ కు మొదటి దూతలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గర్భిణికి సరైన అవగాహన కల్పించి, సురక్షిత ప్రసవా నికి మార్గనిర్దేశం చేయడం తో పాటు తల్లిపాల ప్రాము ఖ్యతను ప్రతి కుటుంబానికి వివరించాలనిసూచించారు.
ఇటీవలి కాలంలో తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతు న్న గర్భిణులు కూడా కనిపి స్తున్నారని, అలాంటి వారి ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నత వైద్య కేంద్రా లకు రిఫర్ చేయాలని అధి కారులను ఆదేశించారు. సమయానికి చికిత్స అంది స్తే తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణా లను కాపాడవచ్చని తెలిపా రు.ప్రపంచ తల్లిపాల వారో త్సవం అనేది కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాద ని, ప్రతి బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలనే సంకల్పానికి ప్రతీక అని పేర్కొన్నారు. "మొదటి గంటలో తల్లిపా లు... మొదటి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే... ఆరోగ్యవంతమైన తల్లి... ఆరోగ్యవంతమైన బిడ్డ... ఆరోగ్యవంతమైన సమా జం..." అనే సందేశాన్ని ప్రతి కుటుంబానికి చేరవేయాల ని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి (డీడబ్ల్యూ ఓ) రాజేందర్ గౌడ్, డిప్యూ టీ డీఎంహెచ్‌ఓ సిద్ధప్ప, డీసీపీవో కరిష్మా, సీడీపీవో వెంకటేశ్వరమ్మ, కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఎంఎల్‌ హెచ్‌పీలు, ఆశా కార్యక ర్తలు, అంగన్‌వాడీ సిబ్బం ది, గర్భిణులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:2.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ 
----------------------------------యు

Tags:

About The Author

Latest News