- District News
- విద్యార్థులకు పాఠాలు బోధించిన మాజీ మంత్రి ..
విద్యార్థులకు పాఠాలు బోధించిన మాజీ మంత్రి ..
ఇచ్చిన మాటకు కట్టుబడి భోజనం వండించి, ఒడ్డించిన వైనం..
---
వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 11:
వనపర్తి మండలం అంజనగిరి గ్రామ పాఠశాల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉపాధ్యాయుడుగా మారి విద్యార్థుల కు పాఠాలు బోధించారు. మంగళవారం "సర్" కార్యక్రమంలో భాగంగా ఆయన అంజనగిరి గ్రామంలో పర్యటించారు. అంజనగిరి పాఠశాల విద్యార్థుల కు ఇచ్చిన మాట ప్రకారం స్వయంగా భోజనం వండించి విద్యార్థులతో మమేకమయీ ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడి తగ్గించుకుని విద్యపట్ల ఇష్టం పెంచుకోవాలన్నారు. విద్యార్థులకు పరిశుభ్రత, మంచినీరు,ఆహార నాణ్యత వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు, అధికారులు విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజమం లోనీ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వపరంగా నిర్వహించే విద్యా సంస్థలలో పర్యటనలు చేస్తూ విద్యాతో పాటు మౌలికవసతుల,ఆహార నాణ్యతపై శ్రద్ధ పెట్టీ మెరుగుపరచాలన్నారు . విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరిగి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదుగుతారన్నారు.ఆయన భోజనం అనంతరం విద్యార్థిని, విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి మనకు ఆహారాన్ని అందించే రైతు, రైతుకూలీల విశిష్టత తెలిపి తల్లితండ్రులతో పాటు ఉపాధ్యాయులను, రైతులను గౌరవించాలని ఉద్బోధించారు.అదే విధంగా విద్యార్థుల కుష చాక్లెట్స్,అరటి పండ్లు పంపిణీ చేశారు. సర్ కార్యక్రమంలో ఆయన వెంట నందిమల్లఅశోక్, కె.మాణిక్యం, సర్పంచ్ నేనావత్ శాం తమ్మ , దేవకుమార్, రఘువర్ధన్ రెడ్డి, ధర్మా నాయక్, రవిప్రకాష్ రెడ్డి,మాధవ్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి, నరేష్,చిట్యాల.రాము,ఉపసర్పంచ్ రాజు, ధర్మేందర్, యాదగిరి, వాసు, తిరుపతయ్య, స్వామి తదితరులు ఉన్నారు.
