- District News
- Ranga Reddy
- విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
విద్యుత్ అంతరాయాలకు చెట్ల కొమ్మలు తొలగింపు
మణికొండలో ప్రజా బాట కార్యక్రమం
గండిపేట, ఆగస్టు 11 (లోకల్ గైడ్),
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, మీడియా అండ్ కమ్యూనికేషన్ వాసిరెడ్డి నరేష్ మాట్లాడుతూ, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించడంతో పాటు విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు విద్యుత్ శాఖ చేపడుతున్న ముందస్తు చర్యలు అభినందనీయమన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటికి తక్షణ పరిష్కారం చూపడమే ప్రజాబాట కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తానిషా కాలనీ వాసులు విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం వల్ల విద్యుత్ అంతరాయాలు తగ్గడంతో పాటు ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని వారు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఐసిసి కోఆర్డినేటర్ నుమాన్, తానిషా కాలనీ సొసైటీ అధ్యక్షులు సీతారామదాస్ కార్యవర్గ సభ్యులు,ఆల్ కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వంశీ తదితరులు పాల్గొన్నారు.
