కల్వర్టు నిర్మాణ పనులు పరిశీలించిన వైస్ చైర్మన్....

నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

Published On
కల్వర్టు నిర్మాణ పనులు పరిశీలించిన వైస్ చైర్మన్....

 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 


మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని17వ వార్డులో ఉర్దూ పాఠశాల ముందు నూతనంగా నిర్మిస్తున్న డ్రైన్,కల్వర్ట్ పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా కల్వర్టు నిర్మాణంలో చేపడుతున్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించి,నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.డ్రైన్,కల్వర్టు నిర్మాణ పనులలో ఎలాంటి నాణ్యత లోపం కనిపించకూడదని సూచించారు.నిర్మాణ పనులలో ఏవైనా అభ్యంతరాలు,అవసరాలు కలిగినట్లయితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Tags:

About The Author

Latest News