జిల్లాలో ఘనంగా పొలాల పండుగ.

Published On
జిల్లాలో ఘనంగా పొలాల పండుగ.

 

నిర్మల్ : లోకల్ గైడ్ :

జిల్లాలో పొలాల అమావాస్య పండుగను గురువారం రైతులు, గ్రామీణ ప్రజలు ఘనంగా నిర్వహించారు. పంట పొలాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే బసవన్నలను (ఎడ్లను) రైతులు రంగులు, అలంకరణ వస్తువులతో అందంగా ముస్తాబు చేశారు,ఆయా గ్రామాల్లోని     హనుమాన్ తదితర ఆలయాల వద్దకు ఎడ్లను ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రదక్షిణలు చేయించారు,అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలు సమర్పించారు,రైతులు తమ వ్యవసాయ పరికరాలకు, పంటలకు పూజలు నిర్వహించారు. గ్రామాల్లో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు.
పంటల సాగు, రైతుల శ్రమకు ప్రతీకగా నిలిచే పొలాల పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. పండుగ సందర్భంగా గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రైతులకు మంచి దిగుబడులు రావాలని, ప్రకృతి అనుకూలించి పంటలు సమృద్ధిగా పండాలని పలువురు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, ఆలయ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, రైతులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం  వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం 
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) సామాజిక అన్యాయాలు,దోపిడీ,అణచివేతను ఎదిరించి చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వినాయక చవితి పండుగను నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో  జరుపుకోవాలి 
భద్రతపై అవగాహన.. చట్టాలపై చైతన్యం.* - షీ టీమ్స్‌, టి సేఫ్‌ యాప్‌, 112, 1930పై విద్యార్థులకు అవగాహన
చట్టాలపై అవగాహనతో హక్కుల పరిరక్షణ.
క్లెయిమ్స్,అభ్యంతరాల స్వీకరణకు,తుది జాబితా గడువు పెంపు
ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగ,ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
విద్యార్థుల సంక్షేమానికి సర్పంచ్ టోనీ అండ