ప్రజలతో మమేకమైన పోలీసింగ్

మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో విస్తృత కమ్యూనిటీ పోలీసింగ్

Published On
ప్రజలతో మమేకమైన పోలీసింగ్

 

 

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 30: 

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ లక్ష్యంగా మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమాలను విస్తృతం చేశారు. ఇందులో భాగంగా విజిబుల్‌ పోలీసింగ్‌, వాహనాల తనిఖీలు, సైబర్‌ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

‘మీ సురక్ష’, ‘నేను సైతం 2.0’, ‘క్షేమంగా గమ్యం చేరండి’ వంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

వాహనాల తనిఖీలతో అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచుతున్న పోలీసులు.. రోడ్డు భద్రత, సైబర్‌ మోసాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ ద్వారా పోలీసు-ప్రజల మధ్య సమన్వయం పెంచి, నేరాల నివారణలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని అధికారులు తెలిపారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్