మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 

ప్రజా ఆస్తుల పరిరక్షణకు ప్రజల సంఘీభావం 

హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కు ప్రజల హర్షం
Published On
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 

గండిపేట్, ఆగస్టు 30 (లోకల్ గైడ్):

ప్రజల ఆస్తుల పరిరక్షణకు, ప్రభుత్వ స్థలాల కబ్జాదారుల నుండి కాపాడుతున్న హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ మణికొండ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం నార్సింగి సర్కిల్ మణికొండ డివిజన్ పరిధిలోని మర్రిచెట్టు నుండి హుడా కాలనీ వరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ మీడియా కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ వాసిరెడ్డి నరేష్ ఆధ్వర్యంలో భారీగా  హైడ్రా వాక్ విత్ మణికొండ నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి నరేష్, సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు, తానాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దామరాజు సీతారాం దాసు వారు మాట్లాడుతూ.... మణికొండ లో ప్రజల సంపదలను చెరువులు, కుంటలు, నాళాలు, వంటి ప్రజా వనరులను కబ్జాదారుల నుండి విముక్తి చేసి తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకు వస్తున్న హైడ్రా సేవలు చిరస్మరణీయమని వారు అన్నారు. ప్రజా ఆస్తుల సంరక్షణే దేహంగా అవినీతికి తావివ్వకుండా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా నిస్వార్ధంగా నిర్వారామంగా పారిదర్శకంగా హైట్రా పనిచేస్తున్న తీరు అభినందనీయమని ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థ అవసరం ఎంతైనా ఉందని వారు పేర్కొన్నారు. ఇప్పటివరకు మణికొండలో హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ నేతృత్వంలో చెరువులు, కుంటలు నాళాలు పార్కులు స్మశాన స్థలాలు తదితర ప్రజా ఆస్తుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ఆక్రమించి యదేచ్ఛగా వ్యవహరించిన కబ్జా దారులు హైడ్రా చర్యలు భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మణికొండలో పార్కులు స్మశాన స్థలాలు చెరువులు కుంటలు ఆక్రమించిన వారి గుండెల్లో రంగనాథ్ నేతృత్వంలో హైడ్రా చర్యలు రైలు పరిగెడుతున్నాయని వారన్నారు. 

పకృతి వనరుల సంరక్షణే భవిష్యత్తు తరాలకు భద్రత 

చెరువులు, కుంటలు, నాలాలు కేవలం నీటి వనరులు మాత్రమే కాదని, అవి నగర పరిరక్షణ వ్యవస్థకు కీలకమైనవని నాయకులు పేర్కొన్నారు. వాటిని కాపాడడం ద్వారా వరదల సమస్యను తగ్గించడంతో పాటు భవిష్యత్తు తరాలకు సురక్షితమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. అభివృద్ధి అవసరమే కానీ ప్రజా ఆస్తులను ప్రకృతి వనరులను నాశనం చేసి చేసే అభివృద్ధి ఎవరికి ఉపయోగపడదని ప్రజా ఆస్తులు ప్రజలకే చెందాలి అన్నారు. వాటిని కాపాడే ప్రతి చర్యకు ప్రజలు అండగా నిలవాలని వారు అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హుడా కాలనీ అధ్యక్షులు దాస్, వెంకటేశ్వరరావు, అల్కాపురి టౌన్షిప్ రవి, అధ్యక్షుడు రాజేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సత్య సీతారామరాజు, సంఘ సేవకులు మహమ్మద్ ఇక్బాల్, శివశంకర్ రావు హుస్సేన్, ఎమ్మార్పీఎస్ నాయకుడు కుమ్మరి సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఇందిరా, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ప్రభావతి, మాజీ ఎంపీటీసీ రాజు, అసోసియేషన్ ప్రజా ప్రతినిధులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం
ఖమ్మం,ఆగస్టు,30: లోకల్ గైడ్:ఖమ్మం : వాసన్ ఐ కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మాజీ...
తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్లో నర్స్ దారుణ హత్య. 
మణికొండలో వాక్ విత్ హైడ్రా ర్యాలీ 
మిషనరీ చర్చి భూములను పరిరక్షించాలి.
శిరీష మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి
బోటనీ అధ్యాపకుడి కోసం దరఖాస్తుల ఆహ్వానం.
ప్రజలతో మమేకమైన పోలీసింగ్