మహిళలు వేధింపులు సహించవద్దు.....

షీ టీమ్స్‌ను ఆశ్రయించండి...

Published On
మహిళలు వేధింపులు సహించవద్దు.....

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

 

మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల జిల్లా గోదావరి రోడ్డులోని ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్,బ్యూటీషియన్,టైలరింగ్ శిక్షణా కోర్సులు నేర్చుకుంటున్న మహిళలకు జిల్లా షీ టీమ్ పోలీసు సిబ్బంది ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతు మహిళలు నేటి సమాజంలో వివిధ కార్యాలయాల్లో,ప్రయాణ సమయాలలో,సామాజిక మాధ్యమాల్లో వివిధ రకాల వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.కుటుంబ గౌరవం,భయం,సామాజిక ఒత్తిడి కారణంగా చాలామంది మహిళలు తమ సమస్యలను బయటకు చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం వివిధ చట్టాలను అమలు చేస్తోందని,మహిళలకు అండగా షీ టీమ్స్ వంటి ప్రత్యేక పోలీసు విభాగాలు నిరంతరం అందుబాటులో ఉంటాయని తెలిపారు.పెళ్లికి ముందు,పెళ్లి తర్వాత పరిచయమైన వ్యక్తులు పాత పరిచయాలు,వ్యక్తిగత సమాచారాన్ని,ఫొటోలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడినా మహిళలు ఎట్టి పరిస్థితుల్లోను భయపడవద్దని సూచించారు.ఎవరైనా వేధింపులకు గురిచేస్తే వెంటనే రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700,మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385లకు సమాచారం అందించాలని తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని సూచించారు.మహిళలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని,సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడమే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని షీ టీమ్ సిబ్బంది తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది సతీష్,వనిత,నిర్వాహకులు అంజి,సిబ్బంది,మహిళలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.