రాజోలు పంచాయతీలో సిబ్బంది మొండిచేయి.. కూలీలతో కార్యాలయాన్ని శుభ్రం చేయించిన పాలకవర్గం!

Published On
రాజోలు పంచాయతీలో సిబ్బంది మొండిచేయి.. కూలీలతో కార్యాలయాన్ని శుభ్రం చేయించిన పాలకవర్గం!

 

 లోకల్ గైడ్ సెప్టెంబర్ 12 కురవి

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం 
రాజోలు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో, గదుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని పంచాయతీ సిబ్బంది శుభ్రం చేయకపోవడంతో పాలకవర్గం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఎంపీడీవో, ఎంపీవో, కార్యదర్శితో పాటు సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఎన్నిసార్లు ఆదేశించినా సిబ్బంది ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పనులను పూర్తిగా గాలికి వదిలేశారు.IMG-20260912-WA0042
దీంతో పంచాయతీ కార్యాలయ పరిసరాలు అధ్వానంగా మారడాన్ని గమనించిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీ సిబ్బంది సహాయనిరాకరణ చేయడంతో, చివరకు రోజువారీ కూలీలను రప్పించి ఆవరణతో పాటు గదుల్లోనిIMG-20260912-WA0040 చెత్తను ఊడ్పించి మొత్తం ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు.
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినా వినకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ సిబ్బంది తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. పాలకవర్గమే నేరుగా కూలీలతో పనులు చేయించాల్సిన దుస్థితి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విధులను విస్మరిస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

తిలక్ స్టేడియంలో నమామి భారతం  తిలక్ స్టేడియంలో నమామి భారతం 
    బెల్లంపల్లి (లోకల్ గైడ్)   భారత స్వాతంత్ర్య ఉద్యమానికి జీవం పోసిన వందేమాతర గీతానికి150సంవత్సరాల నిండిన సందర్భంగా విద్యాభారతి అఖిల భారత విద్యాసంస్థల ఆధ్వర్యంలో తిలక్ స్టేడియంలో
డెంగ్యూ, సీజనల్ వ్యాధుల నివారణకు  డ్రైడే  పకడ్బందీగా నిర్వహించాలి.
రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి..... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ప్రమాద ప్రాంతాల్లో తక్షణ, దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలి. జాయింట్ ఇన్‌స్పెక్షన్ సిఫార్సుల అమలుకు అధికారుల బాధ్యతలు నిర్దేశించాలి.
ఆరేళ్ల బాలికపై పైశాచికత్వం
సీనియర్ జర్నలిస్టు టీకే రమేష్ కు పోలీసుల ఘన నివాళి
యువతకు ఉపాధి, నైపుణ్య శిక్షణే ధ్యేయం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
రైతు కూలీల సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తాం.