ప్రజావాణిలో 9 దరఖాస్తులు.. స్వికరణ

ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరిస్తాం:ఎంపిడిఓ రవీంద్రనాథ్ 

Published On
ప్రజావాణిలో 9 దరఖాస్తులు.. స్వికరణ

 

 

భూపాలపల్లి: (లోకల్ గైడ్ ప్రతినిధి)

స్థానిక మహాదేవపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 9 దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీఓ రవీంద్రనాథ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ ప్రజావాణిలో పంచాయతీరాజ్, రెవెన్యూ, సెర్ప్, గ్రంథాలయ శాఖలకు సంబంధించి మొత్తం 09 దరఖాస్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, వేగవంతమైన పరిష్కారం నిమిత్తం ఆయా శాఖల అధికారులకు పంపించనున్నట్లు ఎంపీడీఓ వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రనాథ్, తహసీల్దార్ సత్యనారాయణతో పాటు వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News