ఫీజు బకాయి – బీజేపీ లడాయి

Published On
ఫీజు బకాయి – బీజేపీ లడాయి

 


పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 24 (లోకల్ గైడ్)
పెద్దపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో
పెండింగ్‌లో ఉన్న రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్  స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, తెలంగాణలో విద్యార్థి విద్రోహ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్‌లను విడుదల చేయకుండా వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.జిల్లా అధ్యక్షులు కర్రే సంజీవరెడ్డి  మాట్లాడుతూ, తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు  చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి నాంది అని అన్నారు.విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయాలు చేస్తున్న ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని హెచ్చరించారు. ఇంజినీరింగ్ విద్యార్థులను “క్రిమినల్ వేస్ట్” అని పేర్కొనడం రేవంత్ రెడ్డి దురహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. అలాగే, జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని దుయ్యబట్టారు.రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ విద్యార్థుల పక్షాన మరింత ఉధృతంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థుల హక్కుల కోసం బీజేపీ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News