- District News
- జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించాలి
జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించాలి
* జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట ఆగస్టు 22:
ప్రజలకు పోలీసులు పార దర్శకంగా జవాబుదారీ తనంతో కూడిన సేవలు అందించాలని నారాయణ పేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు.వార్షిక తని ఖీల్లో భాగంగా శనివారం నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సమగ్రంగా తనిఖీ చేశారు.ముందుగా పోలీస్ సిబ్బంది పరేడ్‌ను నిర్వహించి వారి టర్న్ అవుట్‌ను ఎస్పీ పరిశీలిం చారు. అనంతరం స్టేషన్ ఆవరణలో పరిశుభ్రతను పాటించాలని, ప్రహరీ చుట్టూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిం చాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వచ్చే ప్రతి వ్యక్తి కి రిసెప్షన్ వద్ద తగిన విధం గా స్పందించి, ఫిర్యాదుల ను తప్పనిసరిగా ఆన్‌లై న్‌లో నమోదు చేయడంతో పాటు ఫిర్యాదుదారులకు రసీదు అందించాలని ఆదేశించారు.స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, మాల్ఖా నా, ఆయుధాగారం, వివిధ విభాగాల పనితీరు, సిబ్బం ది టర్న్‌అవుట్, క్రమశిక్షణ, యూనిఫాం నిర్వహణ తది తర అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ అధికారులు, సిబ్బం దితో ముఖాముఖిగా మాట్లాడి వారి విధి నిర్వ హణ, పనితీరు, సంక్షేమాని కి సంబంధించినఅంశాలను తెలుసుకున్నారు.అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సీసీ టీవీ కెమెరాల పనితీరును పరిశీలించి, సీసీటీవీ వ్యవ స్థను సమర్థవంతంగా విని యోగిస్తూ నేరాల నియం త్రణతో పాటు ప్రజల భద్ర తను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రానున్న పండుగలను దృష్టిలో ఉంచుకుని, నేరాల నియంత్రణ కొరకు వి పి ఓ ఎస్ ప్రతి గ్రామంలో పర్యటి స్తూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించి కచ్చి తంగా కనీసం 4 కెమెరాల ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని తెలిపారు. ప్రజ లకు పారదర్శకమైన, సమ ర్థవంతమైన, జవాబుదా రీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, విజి బుల్ పోలీసింగ్, నిఘా పెట్రోలింగ్, కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధా న్యత ఇవ్వాలని సూచిం చారు.మారుతున్న కాలా నికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగావినియోగించాలని, ముఖ్యంగా సి డి టి ఎం ఎస్2.0 e-Sakshya, డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి అంశా ల్లో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ నైపుణ్యా లనుపెంపొందించుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులను సకాలంలో పరి ష్కరించడంతో పాటు నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండేలా సాంకేతిక పరిజ్ఞానాన్నిసమర్థవంతంగా వినియోగించాలని ఆదే శించారు.డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్ర తకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఎల్లప్పుడూఅందుబాటులో ఉంటూ వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా సేవలందించాలని ఆదేశిం చారు.పర్యావరణ పరిర క్షణలో భాగంగా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీ మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో డి సి ఆర్ బిడీఎస్పీ మహేష్, సీఐ శివశంకర్, ఎస్‌ఐ సతీష్ రెడ్డి,ఎస్ బి ఎస్‌ఐ భాగ్యలక్ష్మి రెడ్డి, సి డి ఎస్ ఎస్‌ఐ విజయ్ భాస్కర్, ఎస్‌ఐ-2 మన్యం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ
