కబడ్డీలో పెద్దేముల్ లయన్స్ జోరు.

నియోజకవర్గ స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచిన పెద్దేముల్ జట్టు

విజేతలను అభినందించిన గౌతమి మోడల్ స్కూల్ కరస్పాండెంట్ పి. మహిపాల్‌రెడ్డి
Published On
కబడ్డీలో పెద్దేముల్ లయన్స్ జోరు.

లోకల్ గైడ్/తాండూర్: 
తాండూర్ హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో అక్షర కాన్సెప్ట్ స్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో పెద్దేముల్ లయన్స్ జట్టు విజేతగా నిలిచింది. కోట్‌పల్లి కింగ్స్ జట్టు రన్నరప్‌గా నిలిచింది.
నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో నిర్వహించిన ఈ పోటీలకు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అధినేత బావనోళ్ల శంకర్‌యాదవ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో విజేతలకు శంకర్‌యాదవ్ బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా గౌతమి మోడల్ స్కూల్ కరస్పాండెంట్, టీం స్పాన్సర్ పి. మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పెద్దేముల్ లయన్స్ జట్టు విజేతగా నిలవడంపై క్రీడాకారులను అభినందించారు.
కార్యక్రమంలో ధార్మిక పరిషత్ సభ్యులు విజయ్‌కుమార్, వేణుగోపాల్‌రెడ్డి, ఓం ప్రకాష్ సోమని, టీం స్పాన్సర్లు అజయ్ ప్రసాద్, మనోహర్, డాక్టర్ శరత్ చంద్ర, రాములు, కిషన్, మార్వాడీ యువమంచ్ నాయకులు రాజ్‌కుమార్, పీటీలు రాధాకృష్ణ, గోపాల్, అంపైర్లు రాము, రవి, ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు