నారాయణపేట ఆగస్టు 8:
నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని ట్రాఫిక్ ఎస్సై కృష్ణ చైతన్య తెలిపారు.శనివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక వాహ నాల తనిఖీలు నిర్వహించి నెంబర్ ప్లేట్ లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహనదారులను గుర్తించి జరిమానాలు విధించారు. అలాగే వెంటనే నెంబర్ పెట్లు వేసుకోవాలని అవగా హన కల్పించారు.ఈ సంద ర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ ప్రతి వాహ నానికి నిబంధనల ప్రకారం నెంబర్ ప్లేట్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. నెంబ ర్ ప్లేట్ లేకుండా వాహనా లు నడపడం వల్ల వాహ నాన్ని గుర్తించడం కష్టమ వడంతో పాటు, నేరాలు జరిగిన సందర్భాల్లో దర్యా ప్తుకు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంద న్నారు.వాహనదారులు తమ వాహనాలకు ప్రామా ణికమైన నెంబర్ ప్లేట్లను తప్పనిసరిగా అమర్చుకో వాలని సూచించారు. నెంబర్ ప్లేట్‌ను వక్రీకరిం చడం, అక్షరాలు లేదా అం కెలను స్పష్టంగా కనిపించ కుండా చేయడం, నెంబర్ ప్లేట్ స్థానంలో ఇతర రకాల ప్లేట్లు ఉపయోగించడం వంటి నిబంధనల ఉల్లంఘ నలను సహించబోమని స్పష్టం చేశారు.ట్రాఫిక్ నిబం ధనలు ప్రజల భద్రత కోస మేరూపొందించబడ్డాయని అన్నారు. ప్రతి వాహన దారుడు బాధ్యతగా వ్యవ హరించి నిబంధనలను పాటించాలని సూచించా రు. వాహనం నడిపే సమ యంలో డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్ తదితర పత్రాలు చెల్లు బాటులో ఉండేలా చూసు కోవాలని తెలిపారు.అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరిం చాలని, కార్లు ఇతర నాలు గు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచిం చారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హెచ్చరించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లం ఘించడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉందని ఎస్ఐ కృష్ణ చైతన్య పేర్కొ న్నారు.ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీ సులకు సహకరించాలని, సురక్షితమైన ప్రయాణానికి బాధ్యతాయుతమైన వాహ నదారులుగా వ్యవహరించా లని ఆయన కోరారు.
ఫోటో రైట్ అప్:5.అవగాహన కల్పిస్తున్న పోలీసులు
_____________________