- District News
- Ranga Reddy
- ఉపసర్పంచ్‌పై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
ఉపసర్పంచ్‌పై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్
ఇబ్రహీంపట్నం /యాచారం, ఆగస్టు8 ( లోకల్ గైడ్):
మండల పరిధిలోని ధర్మన్నగూడ ఉపసర్పంచ్ గౌర నాగరాజుపై జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం యాచారం పోలీస్‌స్టేషన్ ఎదుట ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలిస్తున్న నాగరాజును అభివృద్ధి పనులను అడ్డుకోవడంతో పాటు బండ చేన్నయ్య, శ్రీనివాస్, అనిల్ అనే ముగ్గురు వ్యక్తులు భౌతికంగా దాడి చేశారని తెలిపారు.ప్రజాప్రతినిధులపై వరుసగా దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నెల రోజుల క్రితం తక్కళ్లపల్లి తండా ఉపసర్పంచ్‌పై కూడా దాడి జరిగిందని గుర్తుచేశారు.ప్రజాప్రతినిధులపై దాడులకు పాల్పడే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు.నాగరాజుపై దాడికి పాల్పడిన వారిపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. బాధితుడికి న్యాయం జరగకపోతే డీసీపీ, డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని కార్తీక్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్ట శ్రీనివాస్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్, గౌరవ అధ్యక్షులు శివ గౌడ్, ఉపాధ్యక్షులు రోహిత్ , మచ్చ అనిల్ కుమార్ ,రాజు, మధుకర్ రెడ్డి వివిధ మండలాల ఫోరం అధ్యక్షులు ,ఉప సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.
