బుద్ధారం రిజర్వాయర్ కు  కే ఎల్ ఐ  నీరు..

నీరు విడుదల చేసిన వెంటనే రిజర్వాయర్ల కు  చేరవ్ .. --- కుంటలు, చెరువులు నింపుకుంటూ రిజర్వాయర్ల కు   నీరు

రైతుల పట్ల విజ్ఞులైన వారు విమర్శలు చేయకండి.
Published On
బుద్ధారం రిజర్వాయర్ కు  కే ఎల్ ఐ  నీరు..

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 9:

కే ఎల్ఐ, భీమా లాంటి ఎత్తిపోతల నుంచి  విడుదల చేసిన నీరు వెంటనే రిజర్వాయర్ల  కు  చేరుకోవని,  విజ్ఞులైన వారు అవగాహన చేసుకోవాని ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఒక లేక విడుదల చేశారు. వారు విడుదల చేసిన ప్రకటన ఇలా... నీటి జలాల సరఫరాల పై  ఉద్దేశ పూర్వకంగా రాజకీయ రాద్దాంతం చేయడం సరికాదని ప్రకటించారు. రైతులపై నిజమైన ప్రేమ ఉంటే గౌరవప్రదమైన సలహలు ఇవ్వాలన్నారు. నీటి ని విడుదల చేసిన వెంటనే  చివరి రిజర్వాయర్ల వరకు చేరుకోవడం కొన్ని రోజులు పడుతుందన్నా విషయం తెలిసికూడా విమర్శలు చేయడం రాజకీయ దురుద్దేశమే అవుతుందని ఆ ప్రకటనలో పెర్కొన్నారు. 15 రోజుల ముందు నీటిని విడుదలవ్వడం వలన నేటికి రిజర్వాయర్ల  చేరుకుంటున్నాయని తెలిపారు. నీటి విడుదలపై చిల్లర రాజకీయాలు ప్రజలు అర్థం చేసుకోగలరని వారు వెల్లడించారు.  ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రానా కాలువల్లో నీళ్లు పారవన్నారు. నీటి విడుదలకు సంబంధించి ముందస్తుగా చేపట్టిన పనులు పూర్తయిన తర్వాతే కాలువల్లోకి నీరు చేరుతాయని తెలిపారు. ఈ కనీస వాస్తవాన్ని కూడా అర్థం చేసుకోకుండా, “నేను ఇప్పుడు మొత్తుకుంటే ఆ క్రెడిట్ నాకే దక్కుతుంది” అన్నట్లుగా మీరు చేస్తున్న  రాజకీయాలను ప్రజలందరూ గమనిస్తున్నారని ఆ ప్రకటనలో పెర్కొన్నారు. గత రెండు రోజులుగా కాలువల్లో నీరు వస్తోన్నాయని, అది, మీరు మొన్న మొత్తుకున్నారని, నిన్ననే కాలువల్లోకి నీళ్లు వచ్చాయని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  వాస్తవానికి నీటి విడుదలకు సంబంధించిన పనులు అంతకు ముందే దాదాపు 15, 20 రోజుల నుంచి ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు.  ఊర్లలో ఊకే తిరుగుతూ వాస్తవాలు తెలియకుండా మాట్లాడే మీ అనుచరులు కూడా అదే పనిగా మొత్తుకుంటున్నారని ఆ ప్రకటనలో వారు విమర్శలు సంధించారు. వాస్తవాలను గ్రహిస్తే మంచిదని మాజీ మంత్రికి పరోక్షంగా హితువు పలికారు . కళ్లముందు జరుగుతున్న వాస్తవాలను కప్పిపుచ్చి, ఇవాళ తాము మొత్తుకుంటే రేపు కాలువల్లో నీళ్లు వచ్చాయని, అది తమ క్రెడిట్ అని చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు .నీటి విడుదలకు సంబంధించిన పనులు ఎప్పుడు ప్రారంభమ య్యాయి.! ,ఎవరి ఆధ్వర్యంలో జరిగాయి.!!, ఎంత సమయం పట్టిందన్న వాస్తవాలను ప్రజలు తెలుసుకుంటున్నారని వారు తెలిపారు. నీటిపై  చేస్తోన్న మీ ప్రచార ఎత్తుగడలన్నీ ప్రజలు గమనిస్తున్నారని పెర్కొన్నారు . మరో సారి తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల ముందు పరువు, విలువ  తీసుకునే  పని చేయవద్దని హితువు పలికారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...