- District News
- Adilabad
- సీసీఐ పునఃప్రారంభం కోసం చేసిన ఉద్యమాల ఫలితంగానే
సీసీఐ పునఃప్రారంభం కోసం చేసిన ఉద్యమాల ఫలితంగానే
అమిత్ షా ఆదిలాబాద్‌కు వచ్చారు: దర్శనాల మల్లేష్
Published On
By Ram Reddy
అదిలాబాద్ లోకల్ గైడ్ ఆగస్టు 13:
గురువారం సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో దర్శనాల మల్లేష్ మాట్లాడారు. 2014 నుంచి సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం కోసం మాజీ మంత్రి జోగు రామన్న, సాధన సమితి ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు.
ప్రొఫెసర్ కాసిం మాట్లాడిన వీడియోలను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసే ముందు తమ పార్టీ విజ్ఞతపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సీసీఐ పరిశ్రమపై కేంద్రాన్ని ప్రశ్నించాల్సింది పోయి, లోపాయకారి ఒప్పందాలపై మీడియా ముందు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి సీసీఐ పునఃప్రారంభానికి కృషి చేయకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు పరస్పర విమర్శలకు దిగడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను అభాసుపాలు చేసేలా జిల్లా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన పోరగర్జన కార్యక్రమం విజయవంతం కావడం గిట్టని కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకులు సీసీఐ సాధన సమితిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని మల్లేష్ డిమాండ్ చేశారు.CCI సాధన కమిటీ మీడియా సమావేశంలో
దర్శనాల మల్లేష్ - కన్వీనర్
విజ్జగిరి నారాయణ - కో - కన్వీనర్ కో - కన్వీనర్స్ --
కొండ రమేష్
లోకారి పోశెట్టి
వెంకట నారాయణ
S. అరుణ్ కుమార్
జగన్ సింగ్ సభ్యులు బండి దత్తాత్రి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Aug 2026 12:58:18
సిపిఐ (ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యులుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.
