ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం.

ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలి. - తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశం.

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి.
Published On
ఓటర్ల జాబితాపై అవగాహన కార్యక్రమం.

లోకల్ గైడ్/బంట్వారం:
ఓటర్ల జాబితాలో తమ పేరు, ఇతర వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. గురువారం బంట్వారం మండల కేంద్రంలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)లో భాగంగా గ్రామ సభ నిర్వహించి ఓటర్ల జాబితాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, కొత్త పేర్ల నమోదు, పేర్లు, చిరునామాలు తదితర వివరాల్లో మార్పులు, చేర్పుల ప్రక్రియపై అధికారులు అవగాహన కల్పించారు. జాబితాలో ఏవైనా తప్పులు ఉన్నా, అభ్యంతరాలు ఉన్నా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, డిప్యూటీ తహసీల్దార్ మహేష్, ఆర్ఏ రాంగోపాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యాదగిరి, వీఏఓ సునీత, పంచాయతీ కార్యదర్శి మమత, బీఎల్ఏలు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News