- District News
- హాస్టళ్లలో విద్యార్థుల భద్ర తకు అత్యంత ప్రాధాన్యత
హాస్టళ్లలో విద్యార్థుల భద్ర తకు అత్యంత ప్రాధాన్యత
జిల్లా కలెక్టర్ ప్రియాంక.
నారాయణపేట ఆగస్టు 13:
నారాయణపేట జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు, గురుకు లాల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సంబంధిత అధి కారులను ఆదేశించారు.
గురువారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లా లోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్ల భర్తీ పై ఆయా వసతి గృహాల ప్రిన్సిపల్స్, ప్రత్యేక అధికారులు, వార్డెన్ల తో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ
ఇటీవల జిల్లాలోని ఎక్లాస్ పూర్ పాఠశాలలో జరిగిన పాము కాటు ఘటనను దృష్టిలో ఉంచుకుని హాస్టళ్ల పరిసరాల్లో పొదలు, చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉం చాలని, గదులు, నేలలు, గోడల్లోని రంధ్రాలను వెంట నే మూసివేయాలని సూచిం చారు. ప్రతి మంగళవారం, శుక్రవారం డీ-వాటరింగ్ చేపట్టి నీరు నిల్వ ఉండ కుండా చూడాలని, దోమల నివారణకు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు.
బాలికల హాస్టళ్లలో ఆర్ బీ ఎస్ కే బృందాల ద్వారా ఆరోగ్య పరీక్షలు, అనీమి యా స్క్రీనింగ్ పూర్తి చేసి, విద్యార్థుల ఆరోగ్య వివరా లను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా అవ సరమైతే వెంటనే సమీప ఆసుపత్రికి తరలించాలని తెలిపారు.బాలికల హాస్ట ళ్లలో అనుమతి లేని వ్యక్తు ల ప్రవేశాన్ని నిరోధించి, సందర్శకుల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ఆహార నాణ్యత, తాగు నీరు, భవనాల నిర్వహణ, విద్యార్థుల భద్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు.
అవసరమైన చోట్ల సీ ఎస్ ఆర్ నిధులతో ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుగురుకుల విద్యార్థు లకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించేందుకు అవసరమైన చోట్ల కొత్త ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు, పనిచేయని ఆర్వో ప్లాంట్ల మరమ్మతులకు సీ ఎస్ ఆర్ ద్వారా ప్రతిపాదనలు పంపించాలని అధికారుల ను ఆదేశించారు.
జిల్లాలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో ఉన్న ఖాళీ సీట్లను నిబంధనల ప్రకారం వెంటనే భర్తీ చేయా లని కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్ వారీగా, తరగతి వారీగా ఖాళీల వివరాలను సిద్ధం చేసి, కలెక్టరేట్ నుంచి వచ్చిన దరఖాస్తులను పరి శీలించాలని సూచించారు.
అర్హులైన విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి అడ్మిషన్లు పూర్తి చేయాలని, దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవసరమై న చోట జోనల్ కార్యాల యానికి ప్రతిపాదనలు పంపించి అప్రూవల్ తీసు కోవాలని, అయితే ఈ ప్రక్రి య వల్ల అడ్మిషన్లలో జాప్యం జరగకుండా చూడా లని ఆదేశించారు. విద్యా ర్థులు అందుబాటులో ఉండి గురుకులాల్లో సీట్లు ఖాళీగా ఉండే పరిస్థితి రాకుండా, అందుబాటులో ఉన్న అన్ని ఖాళీలను సకాలంలో భర్తీ చేయాలని అధికారులకు ఆమె సూచిం చారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఫణి కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి రషీద్, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:10.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
-------------------------------------
