- District News
- లెక్చరర్‌ను సస్పెండ్ చేయాలి.
లెక్చరర్ను సస్పెండ్ చేయాలి.
బీఆర్‌ఎస్‌వీ నాయకులు దత్తాత్రేయ రావు
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు పిర్యాదు.
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ / తాండూర్:
ఈ ఘటనకు సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్నప్పటికీ, ఇప్పటివరకు సంబంధిత లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఆర్‌ఎస్‌వీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌వీ నాయకులు మాట్లాడుతూ, లెక్చరర్‌పై వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా, సమగ్రంగా విచారణ జరిపి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత కళాశాల యాజమాన్యంపై ఉందని పేర్కొన్నారు.
అలాగే, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. సంబంధిత లెక్చరర్‌ను విచారణ పూర్తయ్యే వరకు విధులకు దూరంగా ఉంచి సస్పెండ్ చేయాలని, విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌వీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్, అబేద్, తౌసీఫ్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
28 Aug 2026 12:58:18
సిపిఐ (ఎం ) రాష్ట్ర కమిటీ సభ్యులుముదిరెడ్డి సుధాకర్ రెడ్డి.
