చేతికి రాఖి..గుండెల్లో అనురాగం

తమ్ముడు అనురాగం..  అక్కకి మమకారం..!

అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్
Published On
చేతికి రాఖి..గుండెల్లో అనురాగం

నారాయణపేట ఆగస్టు28:
తమ్ముడు వస్తున్నాడంటే సంబురం.. చెల్లి అడుగు పెడితే వేడుక.. చేతినిండా రాఖీలు, నోటినిండా మిఠా యిలు, గుండెనిండా అనురాగం.. దోసిళ్లనిండా కానుకలు. అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని  దూర ప్రాంతాల్లో ఉన్న సోదరీ మణులు సైతం తమ సోదరుల వద్దకు చేరుకుని రాఖీల కట్టేందుకు తరలివ చ్చారు.రాఖీ పండుగ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ప్రేమాను బంధాలకు ప్రతీకగా నిలు స్తోంది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోదరీమణు లు తమ సోదరుల నుదుట తిలకం దిద్ది, చేతికి రాఖీ కట్టి మిఠాయిలు తినిపించా రు. శుక్రవారం నారాయణ పేట పట్టణంలోని మూడవ వార్డ్ కౌన్సిలర్ కాకర్ల నారా యణమ్మ తమ్ముడికి రాఖీ కట్టి మిఠాయి తినిపించి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రక్షాబంధ న్ అంటేనే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆప్యాయ తకు ప్రతిరూపమని తెలిపా రు.
ఫోటో రైట్ అప్:7.సోదరునికి రాఖీ కడుతున్న కౌన్సిలర్ కాకర్ల 
____________________

Tags:

About The Author

Latest News