తుక్కుగూడ ఎలక్ట్రానిక్ కంపెనీలో 13 మందికి ఉద్యోగాలు

ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు

Published On
తుక్కుగూడ ఎలక్ట్రానిక్ కంపెనీలో 13 మందికి ఉద్యోగాలు

లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 25:
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న తుక్కుగూడలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి నిరుద్యోగ యువత హాజరయ్యారు. తాజాగా ఆగస్టు 24న నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో మొత్తం 13 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఎంపికైన వారిలో ఆమనగల్లు మండలం నుంచి ఐదుగురు, వెల్దండ మండలం నుంచి ఆరుగురు, తలకొండపల్లి మండలం నుంచి ఇద్దరు ఉన్నారు. మొత్తం 13 మందికి ఉద్యోగాలు లభించడంతో వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా కలగనుందని ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన యువతకు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని, పదోన్నతులు పొందాలని ఆకాంక్షించారు.
అర్హత కలిగిన నిరుద్యోగ యువతకు భవిష్యత్తులోనూ ఉద్యోగ అవకాశాల కోసం ఐక్యత ఫౌండేషన్ సహకారం అందిస్తుందని తెలిపారు. ఉద్యోగాల కోసం ఆసక్తి, అర్హత కలిగిన వారు 9848244119 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Tags:

About The Author

Latest News

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయండి.
హనుమకొండ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 09(లోకల్ గైడ్ న్యూస్) హనుమకొండ  సెప్టెంబర్ 11న జిల్లా కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య...
కూకట్‌పల్లి, కుషాయిగూడలో ఆర్‌ఎస్‌బీ ఫ్యాక్టరీ అవుట్‌లెట్ మెగా సేల్స్
తరగతి సమయాల్లో ఇతర కార్యక్రమాలు వద్దు :
మైలార్దేవపల్లి లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం. 
మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలు –
గోదావరి పుష్కరాల నాటికి ఘాట్‌ అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
క్షేత్ర స్థాయిలో పశువైద్యులు పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో నైపుణ్యాలు సాధించాలి - వెటర్నరీ యూనివర్సిటీ డీన్ ఆఫ్