మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన డి ఎం రేవంత్ రెడ్డి 

పనులు వేగవంతం చేయాలని అధికారుల కు ఆదేశం

Published On
మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన డి ఎం రేవంత్ రెడ్డి 


నారాయణపేట జిల్లా

కొడం గల్ నియోజక వర్గంలోని మద్దూరు మండల కేంద్రం లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి  ఏ. రేవంత్ రెడ్డి శుక్రవారం పరిశీలించా రు.మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్  ప్రియాంక హెలిప్యా డ్ వద్ద పుష్పగుచ్ఛం అంద జేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సంద ర్భంగా కళాశాల భవన నిర్మాణ నమూనా చిత్రప టాన్ని పరిశీలించిన ముఖ్య మంత్రి, భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మా ణ విస్తీర్ణం, తరగతి గదు లు, ప్రయోగశాలలు తదిత ర వివరాలను అధికారు లను అడిగి తెలుసుకున్నా రు.మొత్తం 4 ఎకరాల స్థలంలోని  13,670 చద రపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల భవ నాన్ని నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎం.డీ. గణపతిరెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం భవనం లోపల జరుగుతు న్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించా రు.కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణా నికి అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంకకు ముఖ్యమంత్రి సూచించారు.వచ్చే మార్చి నెలలోపు కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి, వచ్చే విద్యా సంవత్స రంలో విద్యార్థులకు అందు బాటులోకి తీసుకురావా లని ముఖ్యమంత్రి అధి కారులను ఆదేశించారు. మద్దూరు ప్రాంతంలో చేప డుతున్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమా ణాలతో, నిర్దేశిత గడువు లోగా పూర్తి చేయాలని సూచించారు.
 
IMG-20260904-WA0143గురుకుల బాలికల పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన

ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనుల పరి శీలన అనంతరం ముఖ్య మంత్రి  ఏ. రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో చింతల్ దిన్నే వైపు కొనసాగుతున్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశా ల నిర్మాణ పనులను  పరిశీ లించారు.నిర్మాణ పనుల ను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారు లను ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగవం తంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ ప్రతి పడవద్దని సూచించా రు. పనులు నిర్దేశిత ప్రమా ణాలకు అనుగుణంగా లేకపోతే బాధ్యులపై చర్య లు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అయితే గురుకుల పాఠశాల నిర్మా ణానికి స్థలం ఇచ్చిన దాత లకు  ఇందిరమ్మ  ఇండ్లు   మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించా రు. ముఖ్యమంత్రి మద్దూ రుకు చేరుకున్న సందర్భం గా పట్టణంలో అభిమాను లు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగ తం పలికారు.ఈ కార్యక్ర మంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్, తాండూర్ ఎమ్మెల్యే మనో హర్ రెడ్డి, కడ ప్రత్యేక అధి కారి వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయ్ కుమార్, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, డీఆర్వో రాజేశ్వరి, మద్దూరు మున్సిపల్ చైర్ పర్సన్ సరస్వతీ, మద్దూరు మాజీ జెడ్పీటీసీ రఘుప తిరెడ్డి, సింగిల్ విండో  చైర్మన్ నర్సిములు, వీరేశ్ గౌడ్,  స్థానిక ప్రజా ప్రతిని ధులు, సంబంధిత అధికా రులు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.మద్దూరులో అభివృద్ది పనులు పరిశీలించిన సి ఎం.రేవంత్ రెడ్డి,6.అభిమానులతో కరచాలనం చేస్తున్న సి ఎం
-------------------------------------

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్