- District News
- రాఘవయ్యపల్లె నుంచి సదర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు
రాఘవయ్యపల్లె నుంచి సదర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు
మంథని నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చొరవ
పెద్దపల్లి జిల్లా అక్టోబర్ 26 (లోకల్ గైడ్ )
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంథని నియోజకవర్గ అభివృద్ధికి మరో కీలక ముందడుగు వేశారు. మల్హర్ మండలం రాఘవయ్యపల్లె గ్రామం నుంచి సదర్ వరకు రోడ్డు నిర్మాణం కోసం ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.20 లక్షలు మంజూరు చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలను గుర్తించి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ నిధులను కేటాయించారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుంది.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎంపీ ల్యాడ్స్ నిధులను వినియోగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
