పింఛన్లపై సర్పంచ్ ఉమా నరేష్ ప్రత్యేక దృష్టి!

మాదారంలో ఇంటింటికీ వెళ్లి చేయూత లబ్ధిదారుల అర్హతల పరిశీలన.. దళారులను ఆశ్రయించొద్దని సూచన

Published On
పింఛన్లపై సర్పంచ్ ఉమా నరేష్ ప్రత్యేక దృష్టి!

 

కారేపల్లి, సెప్టెంబర్ 26 (లోకల్ గైడ్ న్యూస్) :

మాదారం గ్రామపంచాయతీ పరిధిలో చేయూత పింఛన్ల లబ్ధిదారుల అర్హతల పరిశీలన కార్యక్రమాన్ని సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. పంచాయతీరాజ్ ఏఈ రాజశేఖర్ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉమా నరేష్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పింఛన్ కోసం ఎవరూ దళారులను ఆశ్రయించవద్దని, తమ సమస్యలు, వివరాలను నేరుగా పంచాయతీ కార్యాలయంలో తనకు లేదా పంచాయతీ కార్యదర్శికి తెలియజేయాలని సూచించారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వివరాలను పరిశీలించడం ద్వారా అర్హత కలిగిన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఉమా నరేష్ తెలిపారు. పింఛన్ల విషయంలో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ప్రయోజనం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయ్, అజ్మీర బాలాజీ, వి. భారతి, వీరన్న, కాసాని లక్ష్మీనారాయణ, కోయాల శీను, బట్టు నరసయ్య, బట్టు సంగయ్య, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News