సిరీషాకు న్యాయం చేయాలి.. నిందితులను కఠినంగా శిక్షించాలి

కోమట్లగూడెం గాంధీనగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

అఘాయిత్య ఘటనపై ఆదివాసీలు, రాజకీయ నాయకులు, గ్రామస్తుల నిరసన
Published On
సిరీషాకు న్యాయం చేయాలి.. నిందితులను కఠినంగా శిక్షించాలి

 

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 4, లోకల్ గైడ్ న్యూస్ :

సింగరేణి మండలం కోమట్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగరం గ్రామంలో సిరీషాపై జరిగిన అఘాయిత్య ఘటనను నిరసిస్తూ శుక్రవారం రాత్రి గ్రామస్తులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలు సిరీషాకు తక్షణ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా కొవ్వొత్తులు చేతబూని ర్యాలీ నిర్వహించిన ప్రజలు ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తక్షణమే స్పందించాలని, ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహిళలు, యువతులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మహిళలు, యువత, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సిరీషాకు న్యాయం చేయాలని నినదించారు.

Tags:

About The Author

Latest News

ఆధ్యాత్మిక భావంతో  అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ ఆధ్యాత్మిక భావంతో అట్టహాసంగా యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవం నిర్వహణ
---------------------------------------పెద్దపల్లి,  సెప్టెంబర్-17:(లోకల్ గైడ్ )----------------------------------------సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలో  ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు,...
ఘనంగా ప్రజా పాలన దినోత్సవం.
విఠాయిపల్లి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
టేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో విషపూరిత నాగుపాము  ప్రత్యక్షం.
విమోచన పోరాట యోధులకు గుడిపూడి తిరుమల రావు జోహార్లు
వీధి వీధిలో విజ్ఞేశ్వరునికి ప్రత్యేక పూజల సందడి
ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న జాలిగం రాకేష్