- District News
- గంజాయి గాల్లకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల.... శిథిలావస్థకు చేరిన కెజిఎస్ నంబర్ 1 పాఠశాల..
గంజాయి గాల్లకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల.... శిథిలావస్థకు చేరిన కెజిఎస్ నంబర్ 1 పాఠశాల..
అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయాల్సిన ప్రభుత్వ పాఠశాల గంజాయి గాల్లకు,అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.పట్టణంలోని కెజిఎస్ నంబర్ 1 ప్రభుత్వ పాఠశాల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు
మండిపడుతున్నారు.ప్రభుత్వం విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థులు చదువుకోవాల్సిన పాఠశాల ప్రాంగణం సరైన నిర్వహణ లేక నిర్లక్ష్యానికి గురవుతుండటంతో పాఠశాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....
విద్యా నిలయమా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డానా?
పాఠశాల అంటే విద్యార్థులకు విజ్ఞానం అందించే దేవాలయంగా ఉండాలి,ఉపాధ్యాయులు బోధించాలి,విద్యార్థులు చదువుకోవాలని తల్లిదండ్రులకు భరోసా కలిగించే వాతావరణం ఉండాలి.కానీ కెజిఎస్ నంబర్ 1 పాఠశాల పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పాఠశాలను అనివార్య కారణాల వలన మూసివేయడం,పాఠశాల పరిసరాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడం,భద్రతా చర్యలు లోపించడం వంటి కారణాలతో రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.దీంతో పాఠశాల ప్రాంగణం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల పరిస్థితిపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికారులు కనీస పర్యవేక్షణ చేయకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పాఠశాల భవనాలు,పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తు అవసరమైన మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.సమస్య పెద్దదైన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అధికారులు అప్రమత్తమై పాఠశాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని స్థానికులు వాపోతున్నారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో పోలీసుల పర్యవేక్షణ పెంచితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వ పాఠశాల భవనం ప్రజల సొమ్ముతో నిర్మించిన ఆస్తి దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.అయితే నిర్వహణ లోపంతో పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడం,పరిసరాలు నిర్లక్ష్యానికి గురికావడం పట్ల అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని చెప్పే పాలకులు,అధికారులు క్షేత్రస్థాయిలో ఇలాంటి సమస్యలపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా పాఠశాలల స్థితిగతులను స్వయంగా పరిశీలించి అవసరమైన నిధులు కేటాయించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.రాత్రివేళల్లో నిఘా పెంచాలి
పాఠశాల ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచేందుకు రాత్రివేళల్లో నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు.అవసరమైతే పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.పాఠశాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం ఉంటే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని,పాఠశాల ప్రాంగణంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇప్పటికైనా మేల్కొంటారా?
కెజిఎస్ నంబర్ వన్ పాఠశాల పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.సమస్యను చిన్నదిగా భావించి అధికారులు నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు చేయిదాటే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.పాఠశాల భవనానికి తక్షణ మరమ్మతులు,ప్రాంగణం శుభ్రత,రక్షణ ఏర్పాట్లు,రాత్రివేళల్లో నిఘా,అనధికార వ్యక్తుల ప్రవేశానికి అడ్డుకట్ట వంటి చర్యలను వెంటనే చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజలు సమస్యను చూపిస్తుంటే అధికారులు మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది.బెల్లంపల్లి పట్టణంలో ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన కెజిఎస్ నెంబర్1పాఠశాల దుస్థితిని సంబంధిత పాలకులు అధికారులు పట్టించుకుంటారా లేదా అని వేచి చూడాల్సిందే..
