- District News
- Ranga Reddy
- ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై యు ఎస్ పి సి రెండవ దశ పోరాటం
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై యు ఎస్ పి సి రెండవ దశ పోరాటం
తహసిల్దారులకు వినతి పత్రం అందజేత
టి ఎస్ యు టి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం. వెంకటప్ప
Published On
By Ram Reddy
గండిపేట, ఆగస్టు 13 (లోకల్ గైడ్):
- యు ఎస్ పి సి రెండవ దశ పోరాటం లో భాగంగా గురువారం గండిపేట ఎమ్మార్వో కార్యాలయంలో మెమొరాండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ విద్యారంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలైన పీఆర్సీ ని వెంటనే అమలు చేయాలి, సిపిఎస్ ను రద్దు చేయాలి, ఈనెల ఆగస్టు 15 లోపు బదిలీలు పదోన్నతుల షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని అన్నారు. మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు తక్షణమే యుపిఎస్ లో అమలు చేయాలని సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు పూర్తిగా టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలకు గొడ్డలి పెట్టగా ఉన్న జీవోను 25న సవరించి 20 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు కనీసం ఇద్దరూ ఉపాధ్యాయులు నియమిస్తూ 50 మంది పైగా ఉన్న విద్యార్థులు ఉన్న దగ్గర ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా జీవోను మార్పు చేయాలన్నారు. వివో 2018 ప్రకారం ఉమ్మడి సర్వీస్ రూల్స్ ను రూపొందించి అర్హులైన ఉపాధ్యాయులకు ఎంఈఓ లు డిప్యూటీ ఈవోలు, జె ఎల్ ఎస్ డైట్ లెక్చరర్, బీఈడీ కళాశాలల అధ్యాపకులుగా పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రమతో దోపిడికి గురవుతున్న కేజీబీవీ సిబ్బందికి ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. అన్ని గురుకులాల పాఠశాలలో సమయ సారాన్ని ఒకే విధంగా ఉండేటట్లు చూడాలన్నారు. ఉపాధ్యాయులకు నైట్ డ్యూటీ లో నుండి మినహాయింపు నివ్వాలని కోరారు. ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు టీఎస్ యుటిఎఫ్, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యూఎస్పిసి నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి పోరాట షెడ్యూల్ ఈనెల ఏడో తారీఖు ప్రతి పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్, గండిపేట్ మండల అధ్యక్షుడు ఎండి మాజీ ప్రధాన కార్యదర్శి కె రవికుమార్, నాయకులు ఇందిరా, హనుమంతు, ప్రహ్లాద రావు, శ్రీనివాస్, విజయ్ కుమార్, కిషన్, శ్రీకాంత్,రామచంద్రరావు, సునీల్ భాష, బిక్షపతి, మానయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
27 Aug 2026 11:01:13
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
