ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...

పేదల సొంతింటి కల సాకారం...

Published On
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన 4ఇందిరమ్మ ఇళ్లను మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె లబ్ధిదారుల కుటుంబాలతో ఆప్యాయంగా మాట్లాడి,నూతన గృహాలను పరిశీలించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.పేద,మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ముందుకు సాగుతోంది అని పేర్కొన్నారు.కొత్త ఇంటి తలుపులు తెరుచుకున్న వేళ లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసిందని,తమ ఇంటి నిర్మాణం పూర్తయి,సొంత గృహంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా లబ్ధిదారులందరు ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించి,తమ ఆనందాన్ని పంచుకున్నారు.అనంతరం లబ్ధిదారులందరు తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య,కార్పొరేటర్లు ఎంబడి కుమారస్వామి,తాళ్ల సంపత్ రెడ్డి,ఖలీద్,టీపీసీసీ సభ్యులు,నస్పూర్ పట్టణ ఇన్చార్జి నూకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...