మున్నూరు కాపులు ఐక్యత కలిగి ఉండాలి 

మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు  పుట్టం పురుషోత్తమరావు పటేల్ 

Published On
మున్నూరు కాపులు ఐక్యత కలిగి ఉండాలి 


గండిపేట్, ఆగస్టు 10 (లోకల్ గైడ్):

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఐక్యత కలిగి దేశ అత్యున్నత రాజకీయ లలో కీలక  భూమిక పోషించాలని తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు అధ్యక్షుడు పుట్టం పురుషోత్తమరావు పటేల్ అన్నారు. సోమవారం నార్సింగి సర్కిల్ కోకాపేట్ లో మున్నూరు కాపు ఆత్మ గౌరవ భవన ప్రాంగణంలో సామాజిక న్యాయ శిఖరము బహుజన కుల పితామహుడు కీర్తిశేషులు శివశంకర్ 97 జయంతి సందర్భంగా ఆయన  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు రిజర్వేషన్లు సాధించిన స్వర్గీయ పుంజల శివశంకర్ విగ్రహాన్ని కూడా నెలకొల్పలేని ప్రభుత్వాల భరతం పడతామని సర్దార్ హెచ్చరించారు. ట్యాంక్ బండ్ పై శివశంకర్ విగ్రహం నెలకొల్పడంతో పాటు  నల్సార్ విశ్వవిద్యాలయమునకు ఆయన పేరు పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు రమేష్ హజారి మాట్లాడుతూ ఏది సాధించాలన్న ఐక్యమత్యమే బలమని మున్నూరు కాపులు ఏకతాటిపై వచ్చి అనుకున్నది సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పెద్ది పెంటయ్య , పటేల్ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు  విష్ణువర్ధన్, పటేల్ గోపాల , గణేష్ పటేల్, ఆవుల రామారావు పటే, ఇందూరి తిరుపతి పటేల్, చేవెళ్ల ప్రసాద్ పటేల్, ఆత్మగౌరవ సేవా అధ్యక్షుడు ఉగ్గే శ్రీనివాస్ పటేల్, కంటే సాయన్న పటేల్, స్వామి వివేక్ పటేల్, మాలి కర్ణాకర్ పటేల్, వీరంపల్లి ప్రభాకర్ పటేల్, మీరంపల్లి సత్యం పటేల్, అనంతుల నవీన్ పటేల్, ఆరే క్రాంతి పటేల్, తోట రాజు పటేల్, చక్రం నాగరాజు పటేల్, అనికేత్ పటేల్, ప్రవీణ్ పటేల్, గోపాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ తరగతులు
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తుల చేసుకున్న నిరుద్యోగ యువతకు మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర్లు థియేటర్ చౌరస్తా వద్ద ఉన్న టీటీడీ
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
సిద్దిపేటలో ‘కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరం’..
తీజ్ పండుగ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి 
ఒక ఇంచు భూమి కూడా పోనివ్వను - తీన్మార్ మల్లన్న. 
సర్దార్ మియాను పరామర్శించిన మాజీ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి .