- District News
- మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం
మహిళల రక్షణే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యం
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట ఆగస్టు 10:
నారాయణపేట జిల్లాలో మహిళలు, యువతులు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ యూనిట్లు నిరంతరం పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, బాలికలు ఆకతాయిల వేధింపులు, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, గృహహింస, లైంగిక వేధింపులు లేదా ఇతర ఏ విధమైన అన్యాయాలకు గురైనప్పుడు భయపడ కుండా ధైర్యంగా పోలీసుల ను సంప్రదించాలని ఆయ న కోరారు.విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థిను లు బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, కాలనీలు వంటి ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్‌కు గురైనప్పటికీ, ఉద్యోగ మహిళలు తమ కార్యాల యాల్లో వేధింపులకు గురైనప్పటికీ వెంటనే షీ టీమ్ పోలీసులకు సమా చారం అందించాలని సూచించారు. మహిళలు మరియు బాలికలపై జరిగే వేధింపుల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.గృహహింసకు గురవుతున్న మహిళలు కూడా మౌనంగా బాధపడ కుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, బాధితులకు అవసరమైన న్యాయం అందించేందుకు పోలీసు శాఖ పూర్తి సహ కారం అందిస్తుందని తెలిపారు. మహిళల ఫిర్యాదులపై సత్వర స్పందనతో పాటు నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొ న్నారు.జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో గ్రామా లు, పట్టణాల్లో మహిళా భద్రత, సైబర్ నేరాల నివారణ, సామాజిక మాధ్యమాల వినియో గంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా వేదికలను ఉపయోగించే సమయంలో అపరిచితు లతో వ్యక్తిగత సమాచా రాన్ని పంచుకోవద్దని, ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించా రు.మైనర్ బాలికలను వేధించడం, లైంగికంగా వేధించడం వంటి ఘటనల్లో సంబంధిత నిందితులపై పోక్సో చట్టం కింద కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేని మహిళలు, బాలికలు లేదా వారి కుటుంబ సభ్యులు షీ టీమ్ ఫోన్ నెంబర్ 87126 70398 లేదా డయల్ 100 కు సమాచారం అందించా లని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుం టామని ఎస్పీ తెలిపారు .
ఫోటో రైట్ అప్:6.ఎస్పీ వినీత్
____________________
