- District News
- Nalgonda
- తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గా సురిగి రమేష్ గౌడ్..
తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు గా సురిగి రమేష్ గౌడ్..
Published On
By Ram Reddy
గౌడ సంఘ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతానని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సురికి రమేష్ గౌడ్ అన్నారు. హైదరాబాదులోని ఫిలింనగర్ ఆఫీసులో నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన సురిగి రమేష్ గౌడ్ ను తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడి గా నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు రామచంద్రయ్య గౌడ్ కి, రాష్ట్ర అధ్యక్షులు మల్లేష్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌడ సంఘ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్ తంతనపల్లిశంకర్, పెద్ది వెంకటయ్య సురిగి సైదులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
25 Sep 2026 09:43:24
ఎంవోయూల నుంచి పరిశ్రమల స్థాపన వరకు అమలే అసలు కొలమానం
