బిజెపి రాష్ట్ర నాయకులు

గొట్టుముక్కల సురేష్ రెడ్డి జన్మదిన ఘనంగా

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా రక్తదాన శిబిరం 
Published On
బిజెపి రాష్ట్ర నాయకులు

 

 

WhatsApp Image 2026-08-21 at 16.40.36
బీజేపీ రాష్ట్ర నాయకులు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు.“రక్తదానం – ప్రాణదానం” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రాజాం మహంతకృష్ణ, బీజేవైఎం నాయకులు రామగిరి అఖిల్, రెండ్ల వేణు, పట్టణ ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి కుమార్, బొడ్డుపల్లి అంజి, బొడ్డుపల్లి సంపత్, రావిచిట్టి కుమార్, రాచకొండ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు కాంగ్రెస్‌ పాలనకు వెయ్యి రోజులు.. ఘనంగా సంబరాలు
    రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి 
సిఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే
చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభం
స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సెల్ఫ్ టీచింగ్‌తో సత్తా చాటిన విద్యార్థులు
ఎస్సీ, ఎస్టీ కులాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత, అర్హత కలిగిన వారికి బెస్ట్ అవైలబుల్, ఉన్నత విద్య అమలు,