- District News
- Nizamabad
- స్మశాన వాటిక భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
స్మశాన వాటిక భూమి ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
Published On
By Ram Reddy
నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామానికి చెందిన దళిత స్మశాన వాటికకు సంబంధించిన భూమిని ఆక్రమణకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన దళితులు గురువారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
గ్రామంలోని సర్వే నంబర్ 612లో ఉన్న స్మశాన వాటిక భూమిని ఒకే కుటుంబానికి చెందిన తోట పెంటన్న, తోట గణేష్‌లు ఆక్రమించారని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్మశాన వాటిక భూమి విషయంలో ప్రశ్నించేందుకు వెళ్లిన దళితులను బెదిరిస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.
గతంలో స్మశాన వాటిక భూమిని పరిరక్షించేందుకు ప్రయత్నించిన దళిత గోసంగిలపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని వారు తెలిపారు. దళిత గోసంగి స్మశాన వాటిక భూమిని కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఈ విషయంలో అధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూమిని పరిశీలించి ఆక్రమణలు తొలగించాలని కోరారు.
స్మశాన వాటిక భూమి విషయంలో సమగ్ర విచారణ జరిపి, భూమిని పరిరక్షించడంతో పాటు ఆక్రమణకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వారు కోరారు.
ఈ సమస్యపై తక్షణమే రెవెన్యూ అధికారులతో సర్వే నిర్వహించి వాస్తవ పరిస్థితిని నిర్ధారించి, దళితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి అధికార ప్రతినిధి గంధం రాజేష్, బేడ బుడగ జంగం జన సంఘం జిల్లా అధ్యక్షులు డొక్క రంజిత్, ఉపాధ్యక్షులు సదుల రాజేశ్వర్, మాజీ సర్పంచులు కర్రే లింగస్వామి, కర్రే గంగయ్య గోసంగి కులస్తులు నడిపి సాయిలు, కర్రే రాజన్న, రాసుల గంగాధర్, గంగయ్య లతో పాటు 50మంది దళిత గోసంగి కులస్తులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Sep 2026 20:45:39
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
