- District News
- హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ
మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్
Published On
By Ram Reddy
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 (లోకల్ గైడ్ )
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ జాతీయ, రాష్ట్ర శాఖల పిలుపు మేరకు ఈరోజు సుల్తానాబాద్ మండల కేంద్రంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి భారతీయుడిలో దేశభక్తి, జాతీయతా భావాన్ని మరింత బలోపేతం చేయడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు.ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ సమైక్యత, సమగ్రత,సార్వభౌమత్వాన్ని చాటాలని ఆయన పిలుపునిచ్చారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ, జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేందర్ యాదవ్, మిట్టపల్లి ప్రవీణ్ కుమార్,హర్ ఘర్ తిరంగా జిల్లా కో కన్వీనర్ ఉషణ అన్వేష్, కోట నాగేశ్వర్, కొల్లూరి సంతోష్ కుమార్,లంక శంకర్, కొమ్మిడి రాజేందర్ రెడ్డి, మెండే శంకరయ్య, బండారి లత,మల్కా భాగ్యలక్ష్మి,దాసరి వెంకటేష్,పెరక రమేష్, దొంగల శ్రీనివాస్ రెడ్డి, మనోహర్,వలస సాయి కిరణ్, కొత్తూరి సంపత్,గుర్రం రమేష్,మెంగాని కుమార్, మనుపటి బాలకృష్ణ, ప్రశాంత్, ఈశ్వర్, సుబ్బని సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
10 Aug 2026 15:44:38
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 (లోకల్ గైడ్)కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దతించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న
