- District News
- ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 (లోకల్ గైడ్)
కేంద్రంలోని ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దతించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ప్రజా చైతన్య యాత్ర సుల్తానాబాద్ లో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం ప్రారంభించారు.దేశవ్యాప్తంగా బిజెపి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి, యువజన, మహిళ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ఎండగట్టడానికి భారత కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న దేశవ్యాప్త నిరసన ఉద్యమంలో భాగంగా ప్రజా చైతన్య యాత్ర సుల్తానాబాద్ మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సధానందం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ తో కలసి ప్రారంభించారు.అనంతరం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ దేశంలో మతోన్మాద బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని విద్యార్థులకు చదువుకునే హక్కు లేకుండా పేపర్ లీకేజీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును చెలగాటం ఆడుతున్నదని, మతతత్వాన్ని పోషిస్తూ కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశంలో అశాంతికి కారణమవుతుందని, ధరల పెరుగుదలతో సామాన్యుల బతుకులు ఆగం చేస్తూ, దేశ సంపదను బడా బాబులకు ధారతత్వం చేస్తుందని అందుకే సిపిఐ ఆధ్వర్యంలో బిజెపి హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో సెప్టెంబర్ 1న ఢిల్లీ రాజధానిగా రామ్ లీలా మైదాన్ భారీ బహిరంగ సభ సిపిఐ ఆధ్వర్యంలో జరగబోతుందని దీనిని జయప్రదం కోసం దేశవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర సిపిఐ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర నాయకులు గౌతమ్ గోవర్ధన్, గోశికమోహన్, కే కనకరాజు, రామగుండం నగర సిపిఐ కార్పొరేటర్ మార్కాపూరీ సూర్య, కోడం స్వామి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి మల్లయ్య, ఎం ఎల్లయ్య, ఎజ్జ రాజయ్య, ఓదమ్మ ,పూసల రమేష్, ప్రీతం ,శనిగరపు చంద్రశేఖర్, తోడేటి లావణ్య, రచన, ఏం తిరుపతి, శ్రీనివాస్ రెడ్డి, గట్టయ్యప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు సిపిఐ ప్రచార జాత కార్యక్రమంలో పాల్గొన్నారు.
