కాంగ్రెస్ సర్కారులో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ

ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
Published On
కాంగ్రెస్ సర్కారులో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ

 

 

 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి ఆగస్టు 10 (లోకల్ గైడ్ )
పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నూతన రేషన్ షాపును స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ప్రభుత్వవిప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అనంతరం ఆషాఢ మాస బోనాల పండుగ మహోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా ప్రధాన రోడ్డులో గల శ్రీ కల్యాణమస్తు షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు  చింతకుంట విజయరమణ రావు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ హయంలో పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని నిరుపేదలకు గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులు మంజూరు చేయక వారిని మోసం చేశారని కానీ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్లో అర్హులైన పేదలందరికీ నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేసి వారందరికీ సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలు సుఖంగా ఉన్నారని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ మన రాష్టానికే ప్రతీకగా నిలిచి మన సంస్కృతి సాంప్రదాయాలను మరింతగా ఉట్టిపడేలా జరుగుతున్నాయని మన బోనాల పండుగను మరింతగా ప్రోత్సహిస్తూ రాష్ట ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలు మరియు గుర్తింపును కలిగిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం వీరనాగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.80 లక్షల సహకారం
న్యూస్ స్టార్     లోకల్ గైడ్ – ఆమనగల్లు, ఆగస్టు 10: మాడుగుల మండలం దొడ్లపహాడ్ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూర్తిచేసుకున్న వీరనాగమ్మ దేవత ఆలయంలో 41...
అమ్మ’కు బోనాలు..జగతికి భాగ్యాలు
గ్రామానికి వెలుగు వస్తే ప్రజలకు భద్రత ఉంటుంది.
మత్స్యకారులకు సామాజి క భద్రత ...తెలంగాణ ప్రభుత్వ భరోసా
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ 
తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం