- District News
- Ranga Reddy
- పోలీస్ ఉద్యోగార్థులకు ఐక్యత ఫౌండేషన్ అండ
పోలీస్ ఉద్యోగార్థులకు ఐక్యత ఫౌండేషన్ అండ
కల్వకుర్తిలో ఆగస్టు 16 నుంచి SI, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ ప్రారంభం
లోకల్ గైడ్ ఆమనగల్లు, ఆగస్టు 10:
నియోజకవర్గ గ్రామీణ ప్రాంత యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో చేయూత అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ మరో ముందడుగు వేసింది. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఈవో సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గ యువత కోసం నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉచిత శిక్షణ తరగతుల రెండో బ్యాచ్ ఈ నెల 16వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది.
నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి యువతకు అందుబాటులో ఉండేలా నిర్వహించిన మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తికాగా, అదే అనుభవంతో రెండో బ్యాచ్‌ను మరింత మెరుగైన ప్రణాళికతో ప్రారంభించేందుకు ఫౌండేషన్ ఏర్పాట్లు పూర్తి చేసింది.
కల్వకుర్తిలోని ఓల్డ్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్ బిల్డింగ్, ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా ఈ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. పోలీస్ శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ నిర్వాహకులు కోరారు.
శిక్షణలో ప్రత్యేకతలు
రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ అధ్యాపక బృందంతో శిక్షణ అందించడంతో పాటు ప్రతిరోజూ 9 గంటల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. విద్యార్థుల ప్రగతిని నిరంతరం అంచనా వేసేందుకు రోజువారీ టెస్టులతో పాటు ప్రతి వారం గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తారు. తాజా సిలబస్‌కు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించడంతో పాటు నాన్-మ్యాథ్స్ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు.
ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించడం విశేషం. గ్రామీణ ప్రాంత యువతకు ఆర్థిక భారం లేకుండా నాణ్యమైన శిక్షణ అందించి, పోలీస్ ఉద్యోగాల సాధనకు అవసరమైన పోటీ పరీక్షలపై అవగాహన, ప్రణాళికాబద్ధమైన సిద్ధత కల్పించడమే తమ లక్ష్యమని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
రిజిస్ట్రేషన్ వివరాలు
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 6300553467 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న నియోజకవర్గ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో సాధన చేసి ఉద్యోగాలను సాధించాలని ఐక్యత ఫౌండేషన్ ఆకాంక్షించింది.
