ఈవీఎం గోదామును తనిఖీ చేసిన 

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీ
Published On
ఈవీఎం గోదామును తనిఖీ చేసిన 

 

కామారెడ్డి జిల్లా, సెప్టెంబర్ 15 లోకల్ గైడ్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో క్వార్టర్లీ తనిఖీలో భాగంగా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా గోదాములో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రత, నిర్వహణ, సీసీటీవీ పర్యవేక్షణ వ్యవస్థ, ప్రవేశ నియంత్రణ చర్యలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గోదాం భద్రతకు సంబంధించి అమలు చేస్తున్న ప్రమాణాలు, రికార్డుల నిర్వహణను కూడా సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల భద్రత, గోదాం నిర్వహణ విషయంలో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్. వై. గిరి, తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.