గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్

Published On
గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్

 


కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి)

హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ అంకాపూర్రుచులు’నూతనరెస్టారెంట్‌నుప్రారంభించారు. యజమాని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ రెస్టారెంట్‌లో తెలంగాణ సంప్రదాయ వంటకాలతో పాటు వివిధ రకాల కర్రీలు, బిర్యానీలు, పులావ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు.తెలంగాణ ప్రాంతపు సంప్రదాయ రుచులకు ప్రాధాన్యతనిస్తూ వెజ్, నాన్‌వెజ్ వంటకాలను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇంటి వంటను తలపించే రుచితో పాటు నాణ్యమైన పదార్థాలను వినియోగిస్తూ వినియోగదారులకు రుచికరమైన ఆహారాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.ముఖ్యంగా వివిధ రకాల కర్రీలు, బిర్యానీలు, పులావ్‌లను ప్రత్యేక రుచితో తయారు చేసేందుకు వంటకాల్లో నాణ్యత, రుచికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వంటకాల ప్రత్యేకతను ప్రతిబింబించేలా మెనూను రూపొందించినట్లు చెప్పారు.బాలాజీ లేఅవుట్‌తో పాటు గాజులరామారంపరిసరప్రాంతాలప్రజలకుఅందుబాటులో ఉండేలా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడంతో పాటు స్నేహితులతో కలిసి తెలంగాణ సంప్రదాయ రుచులను ఆస్వాదించేందుకు ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ వేదికగా నిలుస్తుందని వారు తెలిపారు.తెలంగాణ వంటకాల ప్రత్యేక రుచులను ఆస్వాదించాలనుకునే నగరవాసులు తమ రెస్టారెంట్‌ను సందర్శించాలని నిర్వాహకులు విజయ్ కుమార్ కోరారు

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.