శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

Published On
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

శంషాబాద్,ప్రతినిధి లోకల్ గైడ్ సెప్టెంబర్15.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శంషాబాద్ మండల పరిధిలో విద్యార్థుల అభివృద్ధికి విశేష సేవలందించిన గురువులకు "ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు-2026" ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు.స్థానిక ఎంపీడీవో కార్యాలయ మీటింగ్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు.
మండల విద్యాధికారి, మండల వనరుల కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో విద్యారంగంలో అత్యుత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వారి సేవలు వెలకట్టలేనివని అన్నారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్ గాజులరామారంలో ‘తెలంగాణ అంకాపూర్ రుచులు’ గ్రాండ్ ఓపెనింగ్
    కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి) హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
జాతీయ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీర్లు అందరికీ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ సర్కారులో విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పౌష్టికంగా ఉండాలి.
ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి వేడుకలు.
జర్నలిస్టుల ఇంటి స్థలాల కోసం ఈనెల 18, 19 తేదీల్లో రిలే నిరాహార దీక్షలు.
హామీల మోసంపై రైతు కూలీల సమరభేరి
శంషాబాద్‌లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానం చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.