జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి

500 మంది జర్నలిస్టు కుటుంబాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు

ఉద్యమం తప్పదని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ హెచ్చరిక
Published On
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు  ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి

 

 

 

పెద్దపల్లి , సెప్టెంబరు 7: (లోకల్ గైడ్ )


ప్రజలకు–ప్రభుత్వానికి వారధిగా నిలుస్తూ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జర్నలిస్టుల పిల్లల ప్రైవేట్ విద్యా ఫీజుల రాయితీకి సంబంధించి కలెక్టర్లు జీవోలు జారీ చేసినా.. పెద్దపల్లి జిల్లాలో మాత్రం ఆ ప్రక్రియను నాన్చడం దారుణమన్నారు.

జిల్లా కలెక్టర్ నిర్లక్ష్య, అహంకార ధోరణి కారణంగా జిల్లావ్యాప్తంగా దాదాపు 500 మంది జర్నలిస్టు కుటుంబాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మొదటి బిడ్డకు 100 శాతం, రెండో బిడ్డకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాల్సి ఉన్నప్పటికీ, జిల్లా యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం జర్నలిస్టు కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొదటి సెమిస్టర్ పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా కలెక్టర్ తన నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే జర్నలిస్టుల పిల్లల ఫీజు రాయితీ జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు చెందిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే విజయరమణారావు, డీసీసీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ తదితరులు ఈ సమస్యపై తక్షణమే స్పందించి కలెక్టర్ ద్వారా జీవో జారీ చేయించాలని కోరారు.

దశలవారీ ఉద్యమం తప్పదు

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ఇంకా జాప్యం చేస్తే మాత్రం ఇక చూస్తూ ఊరుకునేది లేదని శ్రీనివాస్ హెచ్చరించారు. జర్నలిస్టులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి దశలవారీగా తీవ్రస్థాయి ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు.

ఇళ్ల స్థలాలపై కూడా కార్యాచరణ ఏది?

గతంలో జర్నలిస్టులకు మంజూరైన ఇళ్ల స్థలాల విషయంలోనూ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందేలా సంబంధిత అధికారులతో వెంటనే కార్యాచరణ రూపొందించి ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన అంశాలను ఇకనైనా అధికారులు ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించాలని కోరారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి