- District News
- కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు
Published On
By Ram Reddy
కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ కనీస వేతనాల సలహామండలిలో సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలను చేర్చక పోవడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సుల్తానాబాద్ పూసాల పెద్దమ్మ గుడి వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ప్లే కార్డ్స్ తో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం జాతీయ కనీస వేతనాల సలహా మండలిని నియమించింది,
ఇందులో చట్టపరంగా ఐదు జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులను సభ్యులుగా చేర్చాలి, కానీ జాతీయ సంఘాలైన సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల ప్రతినిధులను నియమించకుండా తన కార్మిక వ్యతిరేక చర్యను మరొకసారి రుజువు చేసుకుంది. దేశంలో పెరుగుతున్న నిత్యవసర సరుకుల ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాలు నిర్ణయించే, సూచనలు ఇచ్చే ఈ సలహా మండలికి తన తొత్తు సంఘాల ప్రతినిధులను, యాజమాన్య ప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థల పేరుతో బిజెపి ప్రభుత్వానికి వంతబడే వారితో ఈ సలహా మండలి నియమించడం అంటే కార్మికుల యొక్క కనీస వేతనం ఇవ్వకుండా దేశంలోని పెట్టుబడుదారులకు, కార్పొరేట్ శేక్తులకు కార్మికుల శ్రమను దోచిపెట్టడానికి ఈ సలహా మండలి పనిచేస్తుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన తప్పుడు వైఖరిని మానుకొని గుర్తింపు పొందిన జాతీయ కార్మిక సంఘాల అయినటువంటి సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టియుసి సంఘాల జాతీయ నాయకులను కనీస వేతనాల సలహా మండలిలో చేర్చాలని డిమాండ్ చేశారు, లేకపోతే ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తునపోరాడుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు సుల్తానాబాద్ మండల కన్వీనర్ తాండ్ర అంజయ్య, కోకన్వీనర్ మాతంగి రాజమల్లు, రైస్ మిల్లు ఆపరేటర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నౌండ్ల బ్రహ్మచారి, బండారి స్వామి, వీరగోని కిరణ్, పర్వతాలు, బండారి తిరుపతి, మాతంగి శంకర్, శీను, నయీమ్, సలోమి, ఈశ్వరమ్మ, బచ్చన్దేవ్, వకీల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
07 Sep 2026 17:53:17
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్):
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
