రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి

జిల్లా కలెక్టర్ ప్రియాంక.

Published On
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి

నారాయణపేట సెప్టెంబర్ 7:

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రైతు కుటుంబానికి ప్రత్య క్షంగా ప్రయోజనం చేకూరే లా, స్థిరమైన ఆదాయ వన రులను కల్పించే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారు లను ఆదేశించారు.  సోమ వారం జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో కరువు నివా రణ పై జిల్లా కలెక్టర్ ప్రియాంక అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో  డ్రాట్  మిటిగేషన్ కార్యక్ర మంలో భాగంగా నారాయ ణపేట జిల్లా లోని ఉట్కూర్ మండలాన్ని  ఎంపిక చేయ గా  దానిని అమలు చేసే  బాధ్యతను  వాసన్ సంస్థ చేపట్టగా సోమవారం కలె క్టర్ అధ్యక్షతన జరిగిన ఈ  సమావేశంలో వాసన్ సంస్థ ప్రతినిధులు  డీ పీ ఆర్ ను పవర్ పాయింట్ ప్రజంటే షన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు.  అనంతరం జిల్లా కలెక్టర్ ప్రియాంక మాట్లాడుతూ గ్రామీణ కుటుంబాల అవసరాలు, స్థానిక వనరులు, రైతుల సామర్థ్యాలను పరిగణన లోకి తీసుకుని ఒకే సమగ్ర ప్రణాళిక కింద వివిధ కార్య క్రమాలను అనుసంధానం చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధు లను చిన్నచిన్న కార్యక్రమా లుగా విభజించడం కంటే, ఎక్కువ మంది రైతు కుటుంబాలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే ఒక ప్రధాన ప్రణాళికను రూపొం దించి అమలు చేయాలని తెలిపారు.వ్యవసాయంతో పాటు పశుసంవర్ధక, పౌల్ట్రీ, డెయిరీ, గొర్రెలు, మేకల పెంపకం తదితర లైవ్‌స్టాక్ రంగాలను ప్రణాళికలో భాగం చేయాలని సూచిం చారు. ముఖ్యంగా పౌల్ట్రీ, లైవ్‌స్టాక్ రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, రైతులకు అవసరమైన ఇన్‌ పుట్స్, సాంకేతిక సహా యం, శిక్షణ, వెటర్నరీ సేవలు, మార్కెట్ లింకేజీ అందేలా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని ఆదేశిం చారు.ఒక్కో చోట ఒక యూనిట్ ఏర్పాటు చేసి వదిలేయకుండా, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి విలువ గొలుసు అభి వృద్ధి చేయాలని కలెక్టర్ సూచించారు. ఉత్పత్తికి అవసరమైన ముడి సరు కులు, ఇన్‌పుట్స్, ఉత్పత్తి, సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, మార్కెటింగ్ వంటి అన్ని అంశాలను సమన్వయం చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీని కేవలం సహ జ వనరుల నిర్వహణ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం చేయకుండా, ప్రతి కుటుంబం యొక్క ఆదాయం, ఆహార భద్రత, వ్యవసాయం, పశుసంపద, ఎంటర్‌ప్రైజెస్, ఉపాధి అవ కాశాలను అనుసంధానం చేసే వేదికగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ సూచిం చారు.ప్రతి కుటుంబానికి వారి అవసరాలు, సామ ర్థ్యాలకు అనుగుణంగా తగిన ఎంటర్‌ప్రైజ్‌ను గుర్తించి, ఆర్థిక సంస్థలు, సంబంధిత శాఖలు, మార్కె ట్ సంస్థల సహకారంతో అమలు చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశిం చారు.ఇప్పటికే ఉన్న ఎఫ్ పీ వో లను బలోపేతం చేయాలని, ప్రతి ప్రాంతంలో కొత్త రైతు ఉత్పత్తిదారుల సంఘాలను  ఏర్పాటు చేయడం కంటే, ఇప్పటికే సమర్థవంతంగా పనిచే స్తున్న  ఎఫ్ పీ వో లను గుర్తించి వాటిని మరింత బలోపేతం చేయాలని కలెక్టర్ సూచించారు.
అవసరం ఉన్న ప్రాంతాల్లో మాత్రమే కొత్త ఎఫ్ పీ వో లను ఏర్పాటు చేసి, వాటికి ప్రాసెసింగ్, నిల్వ, మార్కె టింగ్, వర్కింగ్ క్యాపిటల్, సాంకేతిక సహాయం వంటి అంశాల్లో అవసరమైన సహకారం అందించాలని తెలిపారు.ప్రతి ప్రణాళిక ఆర్థికంగా సాధ్యమైనది, దీర్ఘకాలికంగా నిలకడైనది, కుటుంబానికి ఆదాయం సమకూర్చే విధంగా ఉండా లని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రణాళిక రూపొందించే సమయంలో పెట్టుబడి, ఆదాయ అవకాశాలు, మార్కెట్, నిర్వహణ వ్యయం, కుటుంబానికి కలిగే ప్రయోజనం వంటి అంశాలను సమగ్రంగా అంచనా వేయాలని అధికా రులను ఆదేశించారు.
“ఒక గ్రామం–ఒక సమగ్ర ప్రణాళిక–ప్రతి కుటుంబా నికి ప్రయోజనం–స్థిరమైన ఆదాయం” అనే లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.
ప్రతి ప్రణాళిక ఆర్థికంగా సాధ్యమైనది,దీర్ఘకాలికంగా నిలకడైనది, కుటుంబాలకు స్థిరమైన ఆదాయం అందిం చే విధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి/ కార్యక్రమ నోడల్ అధికారి సక్రియా నాయక్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, జిల్లా మత్స్య శాఖ అధికారి రెహమాన్, వాసన్ సంస్థ ప్రతినిధులు అనిల్ ఉప్పల పాటి, బక్కా రెడ్డి, లక్ష్మణ్, మండల వ్యవ సాయ శాఖ అధికారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:9.సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ 
___________________

-------------------------------------

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి