టీపీసీసీ సోషల్ మీడియా నూతన కమిటీకి ఘన సత్కారం

నూతన చైర్మన్ పెట్టెం నవీన్‌తో పాటు కన్వీనర్లు, కోఆర్డినేటర్లకు శుభాకాంక్షలు తెలిపిన కనకం పవన్ కళ్యాణ్

Published On
టీపీసీసీ సోషల్ మీడియా నూతన కమిటీకి ఘన సత్కారం

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 25 (లోకల్ గైడ్) : హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నూతన టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ శ్రీ పెట్టెం నవీన్‌తో పాటు నూతన సోషల్ మీడియా కన్వీనర్లు, కోఆర్డినేటర్లు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వైరా అసెంబ్లీ టీపీసీసీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కనకం పవన్ కళ్యాణ్ పాల్గొని నూతన బాధ్యతలు చేపట్టిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్ పెట్టెం నవీన్, శ్రీరామ్ లక్ష్మణ్ వీరాపురం, వంశీకృష్ణ పెండ్యాల, శివకుమార్ అంబాలాలను కనకం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కనకం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రస్తుతం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సమాచార వారధిగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సోషల్ మీడియా విభాగం మరింత చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, కన్వీనర్లు, కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో టీపీసీసీ సోషల్ మీడియా విభాగం మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన బాధ్యతలు స్వీకరించిన వారికి అభినందనలు తెలిపారు.

Tags:

About The Author

Latest News