ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ

కబడ్డీ, వాలీబాల్‌లో ప్రథమ బహుమతులు

విద్యార్థులను అభినందించిన పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ
Published On
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ

 



 

 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
సెప్టెంబర్ 07 లోకల్ గైడ్
మండల కేంద్రంలోని ఇండియన్‌ పబ్లిక్‌ పాఠశాల (ఐపీఎస్‌)లో మూడు రోజులపాటు నిర్వహించిన మండల స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ఆ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. మండల ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో పలు విభాగాల్లో బహుమతులు సాధించారు.IMG-20260907-WA0158
కబడ్డీ అండర్‌–17 బాలికల విభాగంలో ఐపీఎస్‌ జట్టు ప్రథమ బహుమతి సాధించింది. వాలీబాల్‌ అండర్‌–17 బాలుర విభాగంలోనూ ప్రథమ స్థానంలో నిలిచింది. ఖోఖో అండర్‌–14 బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి, వాలీబాల్‌ అండర్‌–17 బాలికల విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు.
అథ్లెటిక్స్‌లో షాట్‌పుట్‌ అండర్‌–14, అండర్‌–17 బాలికల విభాగాల్లో ప్రథమ బహుమతులు సాధించగా, అండర్‌–14 బాలుర విభాగంలో తృతీయ బహుమతి దక్కింది. వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ కృష్ణప్రియ అభినందించారు.
చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకుని నిరంతరం సాధన చేయాలని వారు విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో ప్రతిభను మెరుగుపరుచుకుని జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను అభినందించారు.కార్యక్రమంలో పాఠశాల మేనేజర్‌ శివ, వైస్ ప్రిన్సిపాల్ సునీత వ్యాయామ ఉపాధ్యాయులు సత్యనారాయణ, సతీష్‌, జ్యోతి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
సిద్దిపేట, సెప్టెంబర్ 07(లోకల్ గైడ్): సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ పవన్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బహుజన లెఫ్ట్ పార్టీ (బీఎల్‌పీ) సిద్దిపేట...
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి
నాడు ఫ్రెండ్లీ పోలీసు... నేడు రేవంత్ పోలీసు
రైతు కుటుంబానికి స్థిరమై న ఆదాయం కల్పించేలా ప్రణాళికలురూపొందించాలి
కనీస వేతనాల సలహా మండలి లో జాతీయ సంఘాలను చేర్చాలి